పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు
జె.ఎచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం హిందీ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. పద్మ మాట్లాడుతూ హిందీ భాష యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ హిందీ నేర్చుకోవడం వల్ల ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు.
అనంతరం కళాశాల హిందీ అధ్యాపకురాలు డాక్టర్ టి.అరుణ కుమారి మాట్లాడుతూ భారత స్వతంత్ర సంగ్రామంలో హిందీ పాత్ర, జాతీయ సమైక్యతకు హిందీ భాషతోనే సాధ్యమైనది అని అన్నారు. భారతదేశ భాషలలో హిందీ భాష అత్యంత ప్రాచీనమైనదని, హిందీ భాష నేర్చుకోవటంతో దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలలో ఉద్యోగాలు పొందేందుకు సులభతరం అవుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కామేశ్వరరావు డాక్టర్ స్వరూప రాణి అధ్యాపకులు డా. ఏ. వెంకటేశ్వర్లు, పి. శ్రీనివాస్, కె. రాంబాబు, పి. శ్రీనివాస్, శ్రీదేవి, విమల, లీలా సౌమ్య తదితరులు పాల్గొన్నారు.


Post a Comment