డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్స్ కో ఆర్డినేషన్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్స్ కో ఆర్డినేషన్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ


జె.ఎచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్స్ కో ఆర్డినేషన్ సెంటర్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుంచుపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సైబర్ క్రైమ్స్ కో-ఆర్డినేషన్ సెంటర్ జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాల బారిన పడిన వారికి అండగా ఉంటూ,బాధితులు కోల్పోయిన నగదును తిరిగి వారు పొందే విధంగా సహాయం చేయడంలో తోడ్పడుతుందని తెలిపారు.

సైబర్ నేరాల బారిన పడిన వారికి సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కరు చొప్పున 28 మంది సైబర్ వారియర్స్ ను కేటాయించినట్లు తెలిపారు.సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎత్తులతో అమాయక ప్రజల డబ్బును వారి అకౌంట్ల నుండి కాజేస్తున్నారని అన్నారు.జిల్లా వ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల పరిష్కారానికి ఈ సైబర్ క్రైమ్స్ కో ఆర్డినేషన్ సెంటర్ కృషి చేస్తుందని తెలిపారు.



కావున జిల్లా ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండేందుకు జిల్లా పోలీస్ శాఖ తరపున అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిరంతరం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేసారు. సైబర్ నేరాల బారిన పడి నగదు కోల్పోయిన వారు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసి బాధితులు తిరిగి తమ నగదును పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. 


ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్ ఐపిఎస్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు నాగరాజు, శ్రీనివాస్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ జితేందర్, 1టౌన్ సీఐ కరుణాకర్, 2టౌన్ సీఐ రమేష్, కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలోని ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.