సీనియర్ జర్నలిస్ట్ చండ్ర నరసింహారావు సేవలు అభినందనీయం - ఎస్.జె.కె. అహ్మద్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: సీనియర్ జర్నలిస్ట్ చండ్ర నరసింహారావు సేవలు అభినందనీయమని నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్ అన్నారు. గురువారం నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్, ఐ.జె.యు జాతీయ కౌన్సిల్ సభ్యులు చండ్ర నరసింహారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చండ్ర నరసింహారావు ను నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్.జె.కె.అహ్మద్ మాట్లాడుతూ నరసింహారావు అనేక ఏళ్లుగా జర్నలిజం రంగంలో కొనసాగుతూ అనేక ప్రజా సమస్యలను పరిష్కారం దిశగా కృషి చేశారని అన్నారు. పాల్వంచ పట్టణంలోని ప్రజాసమస్యలను తన కథనాల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తున్న జర్నలిస్ట్ నరసింహారావు సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం సభ్యులు ఏవి రాఘవ, సయ్యద్ అక్బర్, జిల్లేపల్లి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు
పలు సెంటర్లలో నరసింహారావు జన్మదిన వేడుకలు :


.webp)
Post a Comment