పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి - న్యాయమూర్తి జి.భానుమతి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి సూచించారు. కొత్తగూడెం జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి సామాజిక బాధ్యత అని తెలిపారు. కోర్టు ఆవరణలో ఉన్న చెత్తను న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తొలగించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఏపీపీలు పివిడి లక్ష్మి, ఎన్.లావణ్య, విశ్వశాంతి, నాగలక్ష్మి, లాడ్స్ ఊట్కూరు పురుషోత్తమరావు, ఉపాధ్యక్షులు తోట మల్లేశ్వరరావు, న్యాయవాదులు ఏపూరి బాబురావు, కటికం పుల్లయ్య అనుబ్రోలు రాంప్రసాదరావు, పిట్టల రామారావు, మల్లెల ఉషారాణి, మెండు రాజమల్లు, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఉద్యోగులు రామిశెట్టి రమేష్, లగడపాటి సురేష్, మీనా కుమారి, ప్రమీల, కృష్ణకుమారి, యాధా రమణ, దీకొండ రవి, ఉష, సిస్టమ్ ఆఫీసర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment