పాల్వంచ లో ఘనంగా జులూస్ ఏ మహమ్మదీ శాంతి ర్యాలీ

 

పాల్వంచ లో ఘనంగా జులూస్ ఏ మహమ్మదీ శాంతి ర్యాలీ

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ఈనెల 16 న మొహమ్మద్ మహా ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించాల్సిన జులుసే మొహమ్మదీ కార్యక్రమాన్ని అదే రోజు వినాయక నిమజ్జనం కార్యక్రమం ఉండటంతో ముస్లిం మత పెద్దలు జులూసే మొహమ్మది కార్యక్రమాన్ని వాయిదా వేసిన సంగతి అందరికి తెలిసిందే. 

తిరిగి శుక్రవారం జులుసే మొహమ్మదీ కార్యక్రమాన్ని పాల్వంచలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ ఇస్లాం మతం యొక్క సారాంశమే సర్వ మానవాళి యొక్క ఐకమత్యం ఇట్టి అంశాన్ని ఆచరణలో ప్రపంచ మానవాళికి చూపిన మహనీయుడు మహమ్మద్ ప్రవక్త అని ప్రతి ముస్లిం కూడా మొహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి మార్గంలో పయనించాలని ఎన్ని అవాంతరాలు వచ్చిన పరమత సహనం పాటించి అన్ని మతాలను గౌరవించాలని భిన్నత్వంలో ఏకత్వం తో కలిసిమెలిసి బతకాలని అందులోనే మానవత్వం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోమొహమ్మద్ ఫయాయాజుల్ హాసన్, మొహమ్మద్ ఇబ్రహీం ఖురేషీ, షేక్ మీరా సాహెబ్, షేక్ అక్బర్ అలీ, మొహమ్మద్ సర్ఫరాజ్ ఆలం, మొహమ్మద్ రఫిఉద్దీన్, సయ్యద్ ఖుస్రు అహ్మద్, ఫఖ్రుద్దీన్,ఫారూఖ్ ఖురేషీ, సయ్యద్ రహీం, మస్తాన్ ఖురేషీ తదితరులు పాల్గొన్నారు.




Blogger ఆధారితం.