దూరదర్శన్ ప్రస్థానానికి 65 ఏళ్లు

దూరదర్శన్ ప్రస్థానానికి 65 ఏళ్లు


జె.హెచ్.9.జాతీయ వార్తలు: ఇప్పుడంటే ప్రైవేట్ టీవీ చానళ్లు, హెచ్ డీ చానళ్ల యుగం నడుస్తోంది కానీ, ఒకప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్శన్ చానల్ ప్రసారాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇంటిల్లిపాదినీ అలరించే ప్రసార సంస్థగా దూరదర్శన్ గతంలో వన్నెకెక్కింది. రామాయణ్, మహాభారత్ వంటి విజయవంతమైన కార్యక్రమాలతో దూరదర్శన్ ఓ వెలుగు వెలిగింది. కానీ కాలక్రమంలో ప్రైవేటు చానళ్ల రాకతో దూరదర్శన్ ప్రాభవం మసకబారింది. 

దూరదర్శన్ ప్రస్థానం కీలక మైలురాయికి చేరింది. దూరదర్శన్ ఈ ఏడాది 65 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1959 సెప్టెంబరు 15వ తేదీన దూరదర్శన్ ప్రారంభమైంది. 1982లో ఇది జాతీయ ప్రసారకర్తగా అవతరించింది. 

ప్రభుత్వ అధీనంలో నడిచే ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 46 స్టూడియోలు ఉన్నాయి. దూరదర్శన్ కింద 33 టీవీ చానళ్లు ఉన్నాయి. ఇందులో డీడీ నేషనల్, డీడీ న్యూస్ పాన్ ఇండియా చానళ్లు. అంతేకాకుండా, దూరదర్శన్ అధీనంలో 17 ప్రాంతీయ చానళ్లు, 11 రాష్ట్ర స్థాయి నెట్ వర్క్ లు, ఓ ఇంటర్నేషనల్ చానల్ (డీడీ ఇండియా) ఉన్నాయి. క్రీడా ప్రసారాల కోసం డీడీ స్పోర్ట్స్, సాంస్కృతిక, సమాచార, వ్యవసాయ అంశాల ప్రసారం కోసం డీడీ భారతి, డీడీ ఉర్దూ, ఓ వ్యవసాయ చానల్ ఉన్నాయి. 

80వ దశకంలో మహాభారత్, రామాయణ్ వంటి సీరియళ్లతో ప్రతి ఇంట్లోనూ దూరదర్శన్ చానల్ సందడి చేసింది. అయితే, 90వ దశకం ఆరంభంలో ఆర్థిక సంస్కరణలకు తెరలేపడంతో ఎన్నో ప్రైవేటు చానళ్లు భారత్ లో ప్రవేశించాయి. అక్కడ్నించి దూరదర్శన్ కు ప్రజాదరణ తగ్గడం మొదలైంది.

Blogger ఆధారితం.