YSR సేవలు చిరస్మరణీయం - కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ గౌస్ మోహినుద్దీన్

YSR సేవలు చిరస్మరణీయం - కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ గౌస్ మోహినుద్దీన్
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీ ఎం.డి. గౌస్ మోహినుద్దీన్ అన్నారు. బుధవారం దివంగత మాజీ సీఎం వై.ఎస్.ఆర్. జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎం.డి. గౌస్ మోహినుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కేక్ కటింగ్,  డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి జోహార్ వైయస్ఆర్ అంటూ నినాదాలు చేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజలకు అందించిన సేవలను స్మరించుకుని కొనియాడారు. రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పార్లమెంట్ ఇన్‌చార్జ్, రాష్ట్ర కార్యదర్శి వీరాపురం రామలక్ష్మణ్, రాష్ట్ర ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ గడ్డం రాజశేఖర్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏలూరి కోటేశ్వరరావు, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్, మాజీ కౌన్సిలర్ ఎం.ఏ. రజాక్, మాదా శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ ఆరిఫ్ ఖాన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏ.వి. కోటిరెడ్డి, గుంటి రామచందర్, కొలిపాక సత్యనారాయణ, రౌతు నిరంజన్, గొడ్డలి యాదగిరి, దుర్గారాశి సమ్మయ్య, గాండ్ల సురేష్, నరసింహారావు, చుంచుపల్లి మండల నాయకులు పెగడ బిక్షపతి, ఆదరి కొమరయ్య, యువజన నాయకులు నయీమ్ తదితరులు పాల్గొన్నారు. 

Blogger ఆధారితం.