సొసైటీ లాభాల వాటాను సభ్యుల ఖాతాల్లో జమ చేయాలి - ఎస్కే మల్సూర్, ఎండి అమీన్

సొసైటీ లాభాల వాటాను సభ్యుల ఖాతాల్లో జమ చేయాలి - అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మల్సూర్, ఎండి అమీన్
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (ECCS Ltd.) 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాఫిట్ షేర్‌ను సొసైటీ సభ్యుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్  కేటీపీఎస్ 7వ దశ అధ్యక్ష కార్యదర్శులు ఎస్.కే. మల్సూర్, ఎం.డి. అమీన్ కోరారు.

శనివారం సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎస్.కే. మల్సూర్, ఎం.డి. అమీన్ ఆధ్వర్యంలో సొసైటీ సీఈఓ మాసిరెడ్డి, అధ్యక్షుడు కేసులాల్ నాయక్, కోశాధికారి రఘుకృష్ణ, డైరెక్టర్లు బుద్ధార్థి మహేందర్, ధర్మరాజులు నాగేశ్వరరావులను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్.కే.మల్సూర్, ఎం.డి.అమీన్ మాట్లాడుతూ 2024–25 సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటాను సభ్యుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, భవిష్యత్తులో కూడా సొసైటీకి లాభాల వాటా వచ్చిన ప్రతిసారి సభ్యుల ఖాతాల్లోనే జమ చేసే విధానాన్ని కొనసాగించాలని కోరారు. సభ్యుల ప్రయోజనాల పరిరక్షణకు తమ సంఘం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పఠాన్ ఖాన్, ఎం.డి. సుభాని, ఎం.డి. మజీద్, ఎం.డి. సయ్యద్, ఎస్.కె. సయ్యద్, ఎం.డి. సాదిక్, ఎస్.కె. అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.