కాంగ్రెస్ పార్టీ ఓబీసీ మెదక్ జిల్లా అబ్జర్వర్‌గా నాని

కాంగ్రెస్ పార్టీ ఓబీసీ మెదక్ జిల్లా అబ్జర్వర్‌గా నాని

జె.హెచ్.9.మీడియా, నిజాంపేట్  : టీపీసీసీ ఓబీసీ మెదక్ జిల్లా అబ్జర్వర్‌గా బాచుపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎత్తరు మహేందర్ (నాని) నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ విభాగం చైర్మన్, ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ నియామక పత్రాన్ని విడుదల చేశారు.

 ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, మెదక్ జిల్లా ఓబీసీ అబ్జర్వర్‌గా తనను నియమించిన టీపీసీసీ ఓబీసీ చైర్మన్ వీరపల్లి శంకర్, టీపీసీసీ ఓబీసీ కన్వీనర్ వెంకటేశ్ గౌడ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఓబీసీ విభాగం ద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని చెప్పారు.

మెదక్ జిల్లా ఓబీసీ అబ్జర్వర్‌గా నానిని నియమించడంపై పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.