అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న - బిఆర్ఎస్ రాష్ట్ర నేత వనమా రాఘవ

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న బిఆర్ఎస్ రాష్ట్ర నేత వనమా రాఘవ

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:   అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని బిఆర్ఎస్ రాష్ట్ర నేత వనమా రాఘవేంద్రరావు అన్నారు. బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా పాత పాల్వంచలోని శ్రీసాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, వనమా బేబీ సరోజినీ దంపతులు, 46వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల ప్రవీణ్ కుమార్, శ్రీలత దంపతులు పాల్గొని శ్రీ సాయిబాబా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ "అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న  అని అన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం మహా పుణ్యకార్యం, గురువుల ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు.



ఈ కార్యక్రమంలో వీరభద్ర ఐటిఐ చైర్మన్ ముత్యాల వీరభద్రం, ముత్యాల రమణమూర్తి, 47వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ మిరియాల అలివేలు, బట్టు మంజుల, ఏనుగుల శ్రీను, యాదయ్య, ఆర్‌ఎంపీ శ్రీను, సిద్ధు, ముదిగొండ శ్రీను, పిల్లల గంగాధర్, రాము, శివరాత్రి వినయ్ తదితరులు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.