పాల్వంచలో ఘనంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు

పాల్వంచలో ఘనంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:    సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు 51వ జన్మదిన వేడుకలను ఆదివారం పాల్వంచ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా ఉదయం కొత్తగూడెం పూర్ణ థియేటర్‌లో ప్రదర్శించిన మహేష్ బాబు బర్త్‌డే స్పెషల్ షో ‘దూకుడు’ చిత్రానికి పాల్వంచ నుంచి భారీగా అభిమానులు తరలివెళ్లారు.

అనంతరం పాల్వంచలోని 43వ డివిజన్‌లో మొక్కలు నాటారు. అనంతరం పాల్వంచలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ రమ్య గారిచే కేక్ కట్ చేయించడం జరిగింది. రోగులకు బ్రెడ్, పండ్లు, వారి సహాయకులకు, పేదలకు, ఆసుపత్రి సిబ్బందికి భోజనం పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కృష్ణ మహేష్ సేన జిల్లా అధ్యక్షులు కనగాల రాంబాబు, ఉపాధ్యక్షులు రాపాక కాంతరాజు, పాల్వంచ కృష్ణ మహేష్ సేన బాధ్యులు మసూద్, కాంపాటి ప్రసాద్, వీరభద్రం, కాంపాటి మహేష్, నాగరాజు, అష్షు, సారయ్య, సురేష్, రాజు, నవీన్, సాయి, ఈశ్వర్, రాజేష్, రఫీ, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.