ఎన్.ఐ.ఎస్ కోచ్‌గా గుర్తింపు పొందిన ఉప్పుశెట్టి రాకేష్

ఎన్.ఐ.ఎస్ కోచ్‌గా గుర్తింపు పొందిన ఉప్పుశెట్టి రాకేష్

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:   పాల్వంచకు చెందిన బాస్కెట్‌బాల్ కోచ్ ఉప్పుశెట్టి రాకేష్ జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) నేతాజీ సుభాస్ సదరన్ సెంటర్‌లో నిర్వహించిన ఎన్.ఐ.ఎస్ (బాస్కెట్‌బాల్) కోర్సును విజయవంతంగా పూర్తి చేసి బెంగళూరు లో హెడ్ కోచ్ వినోద్ చేతుల మీదగా  ఎన్.ఐ.ఎస్ కోచ్ సర్టిఫికేషన్ అందుకున్నారు.

గత మూడు సంవత్సరాలుగా బాస్కెట్‌బాల్ కోచ్‌గా సేవలందిస్తున్న రాకేష్, డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక కోర్సులో ఆధునిక కోచింగ్ విధానాలు, క్రీడా విజ్ఞానం, ఆటగాళ్ల నైపుణ్యాభివృద్ధి, శారీరక దృఢత్వం తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ పొందారు.

ప్రస్తుతం యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు బాస్కెట్‌బాల్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్న ఆయన, ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

 ప్రముఖ న్యాయవాది, పాల్వంచ మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సిపిఐ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా సమితిసభ్యులు దివంగత ఉప్పుశెట్టి ఖాదర్ బాబు కుమారుడు ఉప్పుశెట్టి రాకేష్  ఎన్.ఐ.ఎస్ కోచ్ సర్టిఫికేషన్ అందుకోవడం పట్ల క్రీడాభిమానులు,పాల్వంచ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. 

Blogger ఆధారితం.