TUF జిల్లా అధ్యక్షుడు ఎం.డి.మంజూర్ ఇంట ఈద్ మిలాప్

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) జిల్లా అధ్యక్షుడు ఎం.డి. మంజూర్ నివాసంలో ప్రతి ఏటా రంజాన్ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల, సామాజిక సంఘాల నాయకులను ఆహ్వానిస్తూ ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో సోమవారం ఎం.డి. మంజూర్ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రతి ఏటా రంజాన్ సందర్భంగా ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మంజూర్ ను అభినందించారు. ఈద్ మిలాప్ ద్వారా స్నేహభావం పెంపొందిస్తున్న మంజూర్ సేవలు ప్రశంసనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎస్.జె.కె.అహ్మద్, బీఆర్‌ఎస్ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్,జై తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.డి. రషీద్, ప్రైవేట్ పాఠశాలల జిల్లా అధ్యక్షుడు బండి లక్ష్మణ్, పాకాలపాటి కళాపీఠం అధ్యక్షుడు రోశయ్య చౌదరి, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు దేవదానం, పాల్వంచ కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి కొండలరావు, పాండురంగాపురం పోస్టు మాస్టర్ బండి ఎల్లారావు, సీనియర్ జర్నలిస్ట్ లు చండ్ర నరసింహారావు, తోట శ్రీనివాసరావు, నాయకులు చిటికెన ముసలయ్య, చెరుకు అశోక్,రాఘవులు, భద్రం, కట్టా ఐలయ్య, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment