సైబర్ మోసాల పట్ల విద్యార్థులకు అవగాహన

సైబర్ మోసాల పట్ల విద్యార్థులకు అవగాహన

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెంప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుదవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా భద్రాచలం గ్రంథాలయం స్టడీ సెంటర్, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ ట్రైబల్ ట్రైనింగ్ స్కూల్‌లలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

ఈ  సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి సమాజంలో పెరుగుతున్న సైబర్ మోసాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం సైబర్ క్రైమ్ భద్రతకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాధిక్ పాషా, సీడీపీఓ జ్యోతి, భద్రాచలం పట్టణ సబ్‌ఇన్స్పెక్టర్ సతీష్, రామకృష్ణ, తిరుపతి, సర్పంచ్ పూనెం కృష్ణ, వార్డు సభ్యులు, జిల్లా చైల్డ్ రక్షణ విభాగం సిబ్బంది లత, జిల్లా ఉమెన్ హబ్ టీమ్ సభ్యులు సంతోషి, రూప, స్వాతి, సౌజన్య, సఖి టీమ్, కిశోర బాలికలు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.