సీతారాముల కల్యాణం లోక కల్యాణానికి ప్రతీక – కాంగ్రెస్ రాష్ట్ర నేత కోనేరు చిన్ని

సీతారాముల కల్యాణం లోక కల్యాణానికి ప్రతీక – కాంగ్రెస్ రాష్ట్ర నేత కోనేరు చిన్ని

 జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  సీతారాముల కల్యాణం లోక కల్యాణానికి ప్రతీక అని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) పేర్కొన్నారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం పలు ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసిన మండపాలు, దేవాలయాలను ఆయన సందర్శించి సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పూర్వీకులు అందించిన సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. శ్రీరామ నవమి వేడుకలు సమాజంలో సోదరభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

భక్తిభావంతో జరుపుకునే ఇటువంటి పండుగలు ఒత్తిడితో కూడిన నేటి జీవనశైలిలో మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని తెలిపారు. ఈ వేడుకల విజయవంతానికి కృషి చేస్తున్న నిర్వాహకుల సేవలు అభినందనీయమని అన్నారు.

భద్రాద్రి రామయ్య ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో ప్రసాదాలు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమాల్లో పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.