ఎమ్మెల్సీ రవీందర్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ లను కలిసిన కొత్తగూడెం నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: వరంగల్‌లోని సత్యసాయి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఎమ్మెల్సీ తక్కినపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌లను కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై నాయకులు చర్చించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసి, భవిష్యత్‌లో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు సమష్టిగా కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి తెలంగాణ సమాజానికి, బీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో, పార్టీ కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఇటీవల మృతి చెందిన పెద్ది సుదర్శన్‌రెడ్డికి సంతాపంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చించారు.
ఈ భేటీలో కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులు మల్లెల రవిచంద్ర, కొట్టె వెంకటేశ్వర్లు, దాము, శంకుబావ అనుదీప్, సంపూ సత్యనారాయణ, గుండ్ల వెంకటేశ్వర్లు, దార కరుణాకర్, పాపగంటి సునీల్, నారకట్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment