జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి - జిల్లా జడ్జి పాటిల్ వసంత్

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి - జిల్లా జడ్జి పాటిల్ వసంత్

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కోర్టులో ఈ నెల 21న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్..జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరి మీదైనా ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని (కాంప్రమైజ్) రాజీ చేసుకోవచ్చని అన్నారు. కక్షిదారులు తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవడం వలన సమయం, డబ్బు ఆదా అవుతుందని అన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారం కొరకు ఈ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున అత్యధిక కేసులను పరిష్కరించడం కొరకు పోలీసు అధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కృషి చేయాలని తెలిపారు.

లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోదగిన కేసులు ఇవే:

1. యాక్సిడెంట్ కేసులు 

2. సివిల్ కేసులు

3. చీటింగ్ కేసులు

4. చిట్ ఫండ్ కేసులు

5. భూ తగాదాలకు సంబంధించిన కేసులు

6. వివాహ బంధానికి సంబంధించిన కేసులు

7. చిన్నచిన్న దొంగతనం కేసులు

8. ట్రాఫిక్ చాలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

9. కుటుంబ తగాదాలు

10. బ్యాంకు లావాదేవీల కేసులు

11. టెలిఫోన్ బకాయిల కేసులు

12. కొట్టుకున్న కేసులు

13. సైబర్ క్రైమ్ కేసులు

14. చెక్ బౌన్స్ కేసులను లోక్ అదాలత్‌లో రాజీ చేసుకుని, కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది.

Blogger ఆధారితం.