గంజాయి కేసులో ఇద్దరికీ 10 సంవత్సరాల జైలు శిక్ష

గంజాయి కేసులో ఇద్దరికీ 10 సంవత్సరాల జైలు శిక్ష

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  గంజాయి కేసులో ఇద్దరికీ 10 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కో లక్ష రూపాయల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (ఎన్. డి.పి.ఎస్.స్పెషల్ జడ్జ్) ఎస్.సరిత మంగళవారం తీర్పు చెప్పారు. 

కేసు వివరాలు ఇలా ఉన్నాయి..2020 సెప్టెంబర్ 15న ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద అప్పటి భద్రాద్రి టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ బి. మహేష్ వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో టాటా కంపెనీ మినీ గూడ్స్ వ్యాన్ అతివేగంగా వస్తుండగా ఆపి పరిశీలించగా 10 ప్లాస్టిక్ గంజాయి ప్యాకెట్లు (226.500 కిలోలు), మొత్తం విలువ రూ.33,97,250 కలిగినవి, ఒడిశా రాష్ట్ర మల్కానగిరి జిల్లాకు చెందిన సుజిత్ గోల్డర్, మనోజిత్ రాయ్‌లను అదుపులోకి తీసుకొని సరఫరా చేస్తున్నట్లు గమనించారు. దీంతో అప్పటి ఇన్స్పెక్టర్ టి. స్వామి వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. 

కోర్టులో ముగ్గురు సాక్షులను విచారించారు. సుజిత్ గోల్డర్, మనోజిత్ రాయ్‌పై నేరం రుజువు కావడంతో ఇద్దరికీ పది సంవత్సరాల జైలు శిక్ష, ఇద్దరికీ ఒక లక్ష రూపాయల జరిమానా విధించారు. జరిమాన చెల్లించని యెడల ఆరు నెలల సాధారణ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి నిర్వహించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్సై డి. రాఘవయ్య, లైజాన్ ఆఫీసర్ ఎస్. వీరభద్రం (కోర్టు డ్యూటీ ఆఫీసర్), పి.సీ. సుధీర్ బాబు‌లు సహకరించారు.

Blogger ఆధారితం.