రోశయ్య సేవలు మరువలేనివి : కలెక్టర్ జితేష్ వి.పాటిల్

రోశయ్య సేవలు మరువలేనివి : కలెక్టర్ జితేష్ వి.పాటిల్

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ప్రజాప్రతినిధిగా కొణిజేటి రోశయ్య గొప్ప సేవలు అందించారని భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 4వ వర్ధంతి సభను ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరై రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొణిజేటి రోశయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇతర రాష్ట్రాలకు గవర్నర్ గా విశిష్టమైన సేవలు అందించారని తెలిపారు. రోశయ్య రాజకీయ జీవితమంతా ప్రజల సంక్షేమం, నిస్వార్థ సేవకే అంకితమైందని ఆయన సేవలను గుర్తు చేశారు. 


Blogger ఆధారితం.