పాదయాత్రకు తెలంగాణ ఉద్యమకారుల సంఘీభావం

పాదయాత్రకు తెలంగాణ ఉద్యమకారుల సంఘీభావం

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారులు నవంబర్ 24న సూర్యాపేటలో ప్రారంభించిన  పాదయాత్ర తొమ్మిది రోజుల తర్వాత సోమవారం కొత్తగూడెం కు చేరుకుంది.

ఈ సందర్భంగా కొత్తగూడెంలో సింగరేణి గెస్ట్ హౌస్ వద్ద, పాల్వంచ పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు బరగడి దేవదానం, సయ్యద్ రషిద్, బుడగం నాగేశ్వరరావు, ఉబ్బన శ్రీను, శనగ రామచందర్ రావు తదితరులు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ స్వాగతం పలికారు. 

ఈ పాదయాత్రకు సామ అంజిరెడ్డి నేతృత్వం వహించగా, పాదయాత్రలో యాకయ్య, సోమయ్య, రెహమాన్ అలీ, వెంకన్న, గంగయ్య, శ్రీనివాసరెడ్డి, గంధసిరి రేణుక, ఉపేందర్, అమ్ములు నాయక్, గోపి, రాము తదితరులు పాల్గొంటున్నారు.

సూర్యాపేటలో ప్రారంభమైన ఈ పాదయాత్ర భద్రాచలంలో ముగియనుంది.


Blogger ఆధారితం.