బార్ కౌన్సిల్ ఎన్నికల బరిలో మందడపు శ్రీనివాసరావు
జె.హెచ్.9.మీడియా, హైదరాబాద్ : ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) తరపున తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలకు పోటీ చేస్తున్న మందడపు శ్రీనివాస రావు శనివారం హైకోర్టు ప్రాంగణంలోని తెలంగాణ బార్ కౌన్సిల్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్ధసారధి, ఐలు నేషనల్ కౌన్సిల్ మెంబర్లు జలసూత్రం శివరామ్ ప్రసాద్, ఏడునూతల శ్రీనివాసరావు, ఐలు మహిళా వింగ్ రాష్ట్ర కమిటీ సభ్యులు గాదె సునంద, భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఐలు నాయకులు కటికం పుల్లయ్య, రావిలాల రామా రావు, కిలారు పురుషోత్తం రావు, పోశం భాస్కర రావు, వుడతనేని శ్రీనివాస రావు, తెల్లబోయిన రమేష్, ఉప్పు అరుణ్, దేశబోయిన రాజేందర్, దూదిపాల రవికుమార్ పాల్గొన్నారు.

Post a Comment