వణికిస్తున్న చలి పులి
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో చలి పులి పంజా విసురుతుంది. ఆ జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి..సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో శనివారం ఉదయం ఉష్ణోగ్రత 6.1 డిగ్రీలుకి పడిపోయింది. మెదక్ జిల్లా దామరంచలో 8.2 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా తిప్పారంలో 8.3 డిగ్రీలు నమోదయ్యాయి.
కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా చలి తీవ్రంగా ఉంది. తిర్యాణి మండలం గిన్నెధరిలో 7.1 డిగ్రీలు, సిర్పూర్(యు) 7.3, కెరమెరి 8.5, వాంకిడి 9.8 డిగ్రీలు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 7.3, వికారాబాద్ జిల్లా మొమిన్పేట్లో 7.4 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతగా నమోదు అయ్యాయి.
హైదరాబాద్ నగర పరిధిలోనూ చలి కష్టాలు కొనసాగుతున్నాయి. శేరిలింగంపల్లిలో 7.5, మల్కాజిగిరి 8.1, రాజేంద్రనగర్ 8.5, రామచంద్రపురం 9.3, చందానగర్ 9.7, అల్వాల్ 10 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం మరియు సోమవారం రాష్ట్రంలో చలి గాలులు మరింత తీవ్రమైన వేగంతో వీచే అవకాశం ఉందని, ఉత్తర, మధ్య, తూర్పు, పశ్చిమ తెలంగాణలో చలి మరింత పెరుగుతుందని చెప్పారు. ప్రజలు చలిలో బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిందిగా, శిశువులు, వృద్ధులు మరియు బలహీన వ్యక్తులు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా వాతావరణ శాఖ సూచించింది.
Post a Comment