జాతీయస్థాయి బెంచ్ ప్రెస్ పోటీలకు కాపుల మహేష్ ఎంపిక

జాతీయస్థాయి బెంచ్ ప్రెస్ పోటీలకు కాపుల మహేష్ ఎంపిక

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  ఈనెల 13న ఖమ్మం పట్టణంలో జరిగిన 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి బెంచ్ ప్రెస్ ఛాంపియన్‌షిప్–2025లో పాల్గొన్న పాల్వంచకు చెందిన కాపుల మహేష్ 120 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం సాధించారు.

 దీంతో ఆయన జాతీయస్థాయి బెంచ్ ప్రెస్ పోటీలకు ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జనవరి 6న హర్యానాలో జరిగే జాతీయస్థాయి ఛాంపియన్‌షిప్‌లో కాపుల మహేష్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా క్రీడాభిమానులు, మిత్రులు ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.


Advertising:

Blogger ఆధారితం.