వనమా కాలనీ శివాలయం కమిటీ అధ్యక్షుడికి ఆత్మీయ వీడుకోలు

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ పట్టణ పరిధి వనమా కాలనీలోని శ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కమిటీ అధ్యక్షుడు ఏవి రాఘవులను కమిటీ సభ్యులు మంగళవారం ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడుకోలు పలికారు. వయోభారం దృష్ట్యా స్వగ్రామానికి వెళ్తున్న రాఘవులు తమ కుటుంబ సభ్యుల మధ్య ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో గడపాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కమిటీ బాధ్యులు మాట్లాడుతూ వనమా కాలనీ శివాలయానికి రాఘవులు చేసిన సేవలను కొనియాడారు. ఏవి రాఘవులు గుడి అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారని తెలిపారు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కిర్లంపూడికి చెందిన రాఘవులు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా పాల్వంచకు వచ్చి, ఇక్కడ వనమా కాలనీ శివాలయానికి సేవలు చేయడం నిజంగా  ఈశ్వరేచ్ఛ అని అన్నారు..

ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్‌.జె.కె. అహ్మద్, ఆలయ కమిటీ బాధ్యులు జె. రమణ, ఎం. సంతోష్, పి.ప్రసాద్, ఓంకారం వంశీ వర్ధన్ రాజు, జె. అప్పలనాయుడు, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.