గ్రామీణ డాక్ సేవక్స్ తెలంగాణ సర్కిల్ సెక్రటరీగా బండి జయరాజు
జె.హెచ్.9.మీడియా,ఖమ్మం: ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ తెలంగాణ సర్కిల్ సెక్రటరీగా వైరా మండలం గన్నవరం గ్రామానికి చెందిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బండి జయరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు సూర్యపేటలో జరిగిన ఐదో ద్వైవార్షిక రాష్ట్ర మహాసభల్లో కొత్త కమిటి ఎన్నికలు నిర్వహించారు. ఇందులో సర్కిల్ సెక్రటరీగా జయరాజు ఎంపికయ్యారు.
నూతన గ్రామీణ డాక్ సేవక్స్ తెలంగాణ సర్కిల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన జయరాజును ఉద్యోగ సంఘాల నాయకులు అభినందించారు.


Post a Comment