దేవిలాల్ నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

దేవిలాల్ నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ జాతీయ ఉపాధ్యక్షులు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి దేవిలాల్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం పాల్వంచ పట్టణ పరిధి పాండురంగాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పుస్తకాలు, పెన్లు, పెన్సిళ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా దేవిలాల్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పేద విద్యార్థుల విద్యా అభివృద్ధికి తన సహాయం ఎప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎం.డి. మంజూర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు సురేష్, కాంగ్రెస్ నాయకులు వెంకటరామయ్య, అంకయ్య, కాంగ్రెస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు సోమయ్య, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ బాషా, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు నాగరాజు, జోషి, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.