"కాంగ్రెస్ పార్టీకి పిండం పెడదాం.. రండి" – కాంపెల్లి కనకేష్ పటేల్

"కాంగ్రెస్ పార్టీకి పిండం పెడదాం.. రండి" – కాంపెల్లి కనకేష్ పటేల్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామంలోని సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్–2 వద్ద ఈనెల 30న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న  “కాంగ్రెస్ పార్టీకి పిండ ప్రదానం” కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్ పటేల్ పిలుపునిచ్చారు.


శనివారం జరిగిన సమావేశంలో పాల్వంచ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, జిల్లా మహిళా నాయకురాలు కాలేరు సింధు తపస్వి మాట్లాడుతూ  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, బీఆర్ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా వెంకటేశ్వరరావు పిలుపు మేరకు ఈనెల 30న ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామం వద్ద గల సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్–2లో జరగనున్న కాంగ్రెస్ పార్టీకి పిండ ప్రదానం కార్యక్రమాన్ని పాల్వంచ పట్టణ, మండల బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో, రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో సీతారామ ప్రాజెక్టును ప్రారంభించి రూ. 18 వేల కోట్లతో సుమారు 90% పనులు పూర్తి చేసిందని, ఇంకా 10% మాత్రమే మిగిలి ఉండగా, 2023 సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.

గత 18 నెలలుగా ఈ ప్రాజెక్టు పనులను పట్టించుకోకపోవడం వల్ల రైతులకు నష్టమే జరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు హంగు, ఆర్భాటాలతో ప్రాజెక్టును ప్రారంభించినా, మిగిలిన పనులు పూర్తి చేయకపోవడం కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల నిర్లక్ష్యాన్ని చూపిస్తోందని విమర్శించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగునీరు అందకుండా ఉండటం బాధాకరమని, ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు, నల్గొండ జిల్లాకు నీటిని తరలించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు సాగునీరు ఇవ్వాలని, ఆ తరువాతే ఇతర జిల్లాలకు పంపాలని డిమాండ్ చేశారు. లేకపోతే, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో “కాంగ్రెస్ పార్టీకి పిండ ప్రదానం” అనంతరం తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సంగ్లోత్ రంజిత్, కొత్తచెరువు హర్షవర్ధన్, కొట్టే రాఘవేంద్ర (రవి), ఆలకుంట శోభన్, గంగాధరి పుల్లయ్య, తోట లోహిత్ సాయి, దరిమెళ్ల మురళీకృష్ణ, గిద్దలూరి శివ సాయి, కూరెల్లి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.