తెలంగాణ లా సెక్రటరీని కలిసిన లక్కినేని

తెలంగాణ లా సెక్రటరీని కలిసిన లక్కినేని
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:   కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ సెక్రటేరియట్‌లో లా సెక్రటరీ ఆర్. తిరుపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు.

వినతిపత్రంలో 2019 నుండి న్యాయవాదులుగా నమోదు అయినవారికి హెల్త్ కార్డులు జారీ చేయాలన్న డిమాండ్‌తో పాటు, ప్రస్తుతం అమలులో ఉన్న హెల్త్ కార్డుల ద్వారా అందుతున్న వైద్య ఖర్చుల పరిధిని రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల వరకు పెంచాలన్నారు. అదనంగా, యాక్సిడెంటల్ పాలసీ కింద రూ.10 లక్షల బీమా ప్రయోజనం కలిగిన ప్రత్యేక పాలసీని అమలు చేయాలని కోరారు.

లక్కినేని వినతిపత్రాన్ని లా సెక్రటరీ ఆర్. తిరుపతి సానుకూలంగా స్వీకరించారు. న్యాయవాదుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత అంశాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Blogger ఆధారితం.