రైతు ఉద్యమాలకు సంసిద్ధం కావాలి – ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి ముత్యాల విశ్వనాథం

రైతు ఉద్యమాలకు సంసిద్ధం కావాలి – ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి ముత్యాల విశ్వనాథం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయ రంగం దెబ్బతిని సంక్షోభంలో ఉందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(ఏఐకేఎస్ ) జిల్లా కార్యదర్శి ముత్యాల విశ్వనాథం ఆరోపించారు. శుక్రవారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్‌లో జరిగిన పాల్వంచ మండల రైతు సంఘం ప్రథమ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రైతు సంఘం జెండాను జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్ర కుమార్ ఆవిష్కరించారు.

అనంతరం ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మూడు నల్లచట్టాలను తీసుకువచ్చి దొడ్డి దారిన అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగం దెబ్బతింటే అన్ని రంగాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వాలు గమనించి స్వామినాథన్ సిఫార్సులను తక్షణమే అమలు చేసి రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని కాపాడాలని కోరారు. వ్యవసాయ రంగం బలంగా ఉంటేనే అన్ని రంగాలు మెరుగవుతాయని తెలిపారు. పంటలకు మద్దతు ధర గ్యారెంటీ చేసే చట్టం అమలు చేస్తే తప్ప వ్యవసాయంలో రైతు నిలబడగలడని తెలిపారు. రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా శక్తివంతమైన ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల ముందు రుణమాఫీ, రైతు భరోసా అందిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి, పంటలకు సాగునీరు అందించేలా పాలకులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మహాసభలో BKMU జిల్లా అధ్యక్షుడు వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబు, నరటి రమేష్, వేములపల్లి శ్రీను, DHPS జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, ప్రజాసంఘాల నాయకులు వేములపల్లి రాజశేఖర్, భూక్యా విజయ, జకరయ్య, వైఎస్ గిరి, రైతు సంఘం నాయకులు కంగర అప్పారావు, బాణోత్ రంజిత్, జరుపుల మోహన్, బాదే చెన్నయ్య, ఎడవల్లి కృష్ణ, భీమా నాయక్, ఆడెపు పెద్ద వెంకట్రామయ్య, ఆంగోత్ బాలాజీ, ఈసం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.