ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయండి - పాల్వంచ కళా పరిషత్

ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయండి - పాల్వంచ కళా పరిషత్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :పాల్వంచ కళా పరిషత్ ఆధ్వర్యంలో రేపటి నుండి ప్రారంభం కానున్న ఉగాది ఉత్సవాలకు పాల్వంచ ప్రజలు, కళాకారులు, కళాభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాల్వంచ కళా పరిషత్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బిక్కసాని సుధాకర్ రావు, అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి వేముల కొండలరావు కోరారు.

శనివారం వేణుగోపాల్ థియేటర్ ప్రాంగణంలో ఉగాది ఉత్సవాలకు ముస్తాబవుతున్న కళా ప్రాంగణాన్ని కళా పరిషత్ బృందం పరిశీలించింది. అనంతరం ఉగాది ఉత్సవాల బ్రోచర్‌ను మంతపురి రాజు గౌడ్, డాక్టర్ బిక్కసాని సుధాకర్ రావు కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ నవల రచయిత సిరంశెట్టి కాంతారావు, ప్రముఖ వ్యాఖ్యాత నరసింహకుమార్, ఉపాధ్యక్షుడు డాక్టర్ నామ బుచ్చయ్య, కమిటీ సభ్యులు రావి మోహన్ రావు, సందీప్, పాల్వంచ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అబ్బురాం, రామకృష్ణ, ముగిది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.