మహిళా న్యాయవాదుల ఉపన్యాస పోటీలు విజయవంతం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర మహిళా కన్వినింగ్ కమిటీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా న్యాయవాదుల ఉపన్యాస పోటీలు బుధవారం విజయవంతంగా ముగిశాయి.
కొత్తగూడెం బార్ అసోసియేషన్ హాలులో జి.కె.అన్నపూర్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 30 మంది మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. గాదె సునంద స్వాగతం పలికిన ఈ కార్యక్రమాన్ని రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కె. సాయి శ్రీ ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కన్వినర్ చందాల శైలజ, రాష్ట్ర కో కన్వీనర్ వై. మంజులత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొత్తగూడెం బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి ఎన్. ప్రతిభ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యురాలు అడపాల కస్తూరి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
పోటీలో ఆర్తి మక్కడ్ ప్రధమ బహుమతి, జి.నాగస్రవంతి ద్వితీయ బహుమతి, కె.ఆర్.వి. నీలవేణి తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. పోటీలో సమాంతరంగా ప్రదర్శన కనబరిచిన ఎన్. ఉషారాణి, జి. శాంత, దాసరి కవిత, ఎం. సంధ్యలకు కన్సోలేషన్ బహుమతులు లభించాయి. లా విద్యార్థిని పి. శరణ్య, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. లావణ్య కూడా కన్సోలేషన్ బహుమతులు అందుకున్నారు.
విజేతలకు, అతిథులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్, సీనియర్ సివిల్ జడ్జి బి. రామారావు, ఏ.ఐ.ఎల్.యు. జాతీయ కౌన్సిల్ సభ్యులు జె. శివరాం ప్రసాద్, జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ మక్కడ్, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్. సత్యనారాయణ, ఏ.ఐ.ఎల్.యు. జిల్లా నాయకులు పి. కిషన్ రావు, కె. పురుషోత్తం రావు, కె. పుల్లయ్య, ఆర్. రామారావు, డి. రవి కుమార్, జి. కాంతయ్య, ఎం.డి. సాదిక్ పాషా తదితరులు జ్ఞాపికలు అందజేశారు.
కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఏ. రవి కుమార్, పి. రామారావు, టి. రమేష్ సహకరించారు. దాసరి కవిత వందన సమర్పణ చేశారు.

Post a Comment