సునీత విలియమ్స్ క్షేమంగా భూమిపై చేరుకోవాలని ప్రార్థిద్దాం - సామాజిక వేత్త నిజాముద్దీన్

సునీత విలియమ్స్ క్షేమంగా భూమిపై చేరుకోవాలని ప్రార్థిద్దాం - సామాజిక వేత్త నిజాముద్దీన్
జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్ :  భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ క్షేమంగా భూమిపై చేరుకోవాలని, అందరూ భగవంతున్ని ప్రార్థించాలని హైదరాబాద్‌కు చెందిన సామాజిక వేత్త నిజాముద్దీన్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

సునీతా విలియమ్స్ మరో రెండు రోజుల్లో భూమిపై చేరుకోనున్నట్లు నాసా ప్రకటించడం ఆనందించదగిన విషయం అని అన్నారు. ఆమె క్షేమంగా భూమిపై తిరిగి రావాలని గత ఐదు నెలలుగా ప్రత్యేక వీడియోలను రూపొందించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నట్లు నిజాముద్దీన్ తెలిపారు.

ఆమె కోసం సర్వమత ప్రార్థనలను నిర్వహిస్తున్నామని, ఖగోళంలో చిక్కుకుపోయినప్పటికీ అధైర్యపడకుండా ఆమె చూపిన సహనం ఎంతో మందిని ఆకర్షించిందని అన్నారు.

రంజాన్ మాసం కావడంతో ఈ నెలరోజుల పాటు ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్థనలను కూడా నిర్వహిస్తున్నట్లు నిజాముద్దీన్ తెలిపారు.

Blogger ఆధారితం.