విధులను బహిష్కరించిన కొత్తగూడెం న్యాయవాదులు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : రంగారెడ్డి జిల్లాలో న్యాయమూర్తిపై జరిగిన దాడికి నిరసనగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులను బహిష్కరించారు.
ఈ సందర్భంగా శుక్రవారం కొత్తగూడెం బార్ అసోసియేషన్ హాల్లో జరిగిన అత్యవసర సమావేశంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్.ఆర్. రవిచంద్ర మాట్లాడుతూ "రంగారెడ్డిలో న్యాయమూర్తిపై జరిగిన దాడిని మొత్తం న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తూ, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం." అని పేర్కొన్నారు. దాడికి నిరసనగా ఏకగ్రీవంగా సమావేశం తీర్మానం చేసి, విధులను బహిష్కరించినట్లు తెలిపారు.
అనంతరం సీనియర్ న్యాయవాది కటకం పుల్లయ్య మాట్లాడుతూ "ఇలాంటి దాడులు సామాన్యులకు న్యాయవ్యవస్థపై నమ్మకం లేకుండా చేస్తాయి. సామాన్య ప్రజలు భయాందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది." అని అన్నారు.
ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు ఏ. కరుణాకర్, ఎస్. ప్రవీణ్ కుమార్, సీనియర్ న్యాయవాదులు జలసూత్రం శివరాంప్రసాద్, జీవీకే మనోహర్ రావు, వివి. సుధాకర్ రావు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి, మల్లెల ఉషారాణి, మునిగడప వెంకటేశ్వర్లు, మారపాక రమేష్, కట్టుకోజ్వల నాగేశ్వరరావు, ఎన్.వి. రాజేష్, మనుబోతుల సత్యనారాయణ, రావిరాల రామారావు తదితరులు పాల్గొన్నారు.


Post a Comment