పారా లీగల్ వాలంటీర్లు బాధ్యతతో కర్తవ్యాన్ని నిర్వర్తించాలి - న్యాయమూర్తి జి. భానుమతి

పారా లీగల్ వాలంటీర్లు బాధ్యతతో కర్తవ్యాన్ని నిర్వర్తించాలి - న్యాయమూర్తి జి. భానుమతి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పారా లీగల్ వాలంటీర్లకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయమూర్తి జి. భానుమతి పాల్గొని పారా లీగల్ వాలంటీర్ల కీలక బాధ్యతలపై మాట్లాడారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో న్యాయాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంలో పారా లీగల్ వాలంటీర్ల పాత్ర ముఖ్యమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వృద్ధాశ్రమాలు, మానసిక వికాస కేంద్రాల్లో క్లినిక్స్ ఏర్పాటు చేసి, అక్కడి సమస్యలను గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. న్యాయ సంబంధమైన సమస్యల విషయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆమె కోరారు.


కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ పేదలకు న్యాయం అందించడం పారా లీగల్ వాలంటీర్ల ప్రధాన కర్తవ్యమని, వారు ప్రజలకు న్యాయం అందించే వారధిగా పని చేయాలని తెలిపారు.


ఈ శిక్షణ కార్యక్రమంలో చీప్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి. పురుషోత్తం రావు, డిప్యూటీ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, న్యాయవాదులు జి. రామచంద్ర రెడ్డి, మరపాక రమేష్, షాజహాన్ పర్వీన్, జి. సునంద, మెండు రాజమల్లు, అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్స్ జి. నాగ స్రవంతి, జ్యోతి విశ్వకర్మ, వర ప్రసాద్, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.