ఐ.ఏ.ఎల్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన జిల్లా జడ్జి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో రూపొందించిన టేబుల్ క్యాలెండర్, పాకెట్ క్యాలెండర్‌ను భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ బుధవారం జిల్లా కోర్టులోని లైబ్రరీ హాలులో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు రోజువారీ తమ విధులను నిర్వహించుకోవడానికి అనుగుణంగా ఈ క్యాలెండర్ తయారైందని అన్నారు. కోర్టు రోజువారీ పని దినాలు, పండుగల సెలవులు వంటి వివరాలతో సమగ్రంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ క్యాలెండర్ రూపొందించిందని, ఇది అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికారి జి. భానుమతి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బి. రామారావు, ఒకటవ, రెండవ అదనపు జూనియర్ న్యాయమూర్తులు సుచరిత, సాయి శ్రీ, భద్రాచలం న్యాయమూర్తి శివ నాయక్,ఐ.ఏ.ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యలమోలు ఉదయ భాస్కరరావు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, సీనియర్ న్యాయవాదులు పోసాని రాధాకృష్ణమూర్తి, ఊట్కూరి పురుషోత్తం, పుల్లయ్య, సుధాకర్, ఐ.ఏ.ఎల్ రాష్ట్ర నాయకులు బాగా మాధవరావు, మునిగడప వెంకటేశ్వర్లు, ఉప్పు శెట్టి సునీల్, మనుబోతుల సత్యనారాయణ, జియా హుల్ హసన్, యాస మౌనిక, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సందు ప్రవీణ్, సాదిక్ పాషా, ప్రతిభ, దూదిపాల రవికుమార్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, పీపీలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment