వ‌ణకిన సమ్మ‌క్క-సార‌క్క గ‌ద్దెలు..సీసీ టీవీకి చిక్కిన దృశ్యాలు

వ‌ణకిన సమ్మ‌క్క-సార‌క్క గ‌ద్దెలు..సీసీ టీవీకి చిక్కిన దృశ్యాలు

జె.హెచ్.9. మీడియా,ములుగు: ములుగు జిల్లాలోని మేడారంలో బుధవారం ఉదయం భూమి కంపించ‌డంతో స‌మ్మ‌క్క-సార‌క్క గ‌ద్దెలు వ‌ణికిపోయాయి. ఉదయం 7:27 నిమిషాలకు భూమి కంపించినట్లు రికార్డయ్యింది. రిక్ట‌ర్ స్కేలుపై 5.3 తీవ్ర‌తతో ఈ భూకంపం సంభ‌వించింది. భూకంపం స‌మ‌యంలో సార‌క్క గ‌ద్దె వ‌ద్ద ఉన్న సీసీ టీవీ కెమెరాలో గ్రిల్స్ ఊగిన‌ట్లు స్ప‌ష్టంగా కనిపించింది.


భూమి కంపించే స‌మ‌యంలో గ‌ద్దె వ‌ద్ద ముగ్గురు ఉన్నారు. ఒక‌రు గ‌ద్దె వ‌ద్ద కూర్చుని పూజ చేస్తుండ‌గా, ఇంకో వ్యక్తి దగ్గరుండి చూస్తున్నాడు. మ‌రో మహిళ కూడా గ‌ద్దె వ‌ద్దే ఉన్నట్లు తెలుస్తోంది.  భూకంపం తీవ్ర‌తకు గ‌ద్దె చుట్టూ ఉన్న ఇనుప గ్రిల్స్ ఊగిన‌ట్లు సీసీ టీవీ ఫుటేజీలో స్ప‌ష్టంగా కనిపించింది.


ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Blogger ఆధారితం.