క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి - సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :గెలుపు, ఓటమిని క్రీడాకారులు సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, కొత్తగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎస్కే సాబీర్ పాషా క్రీడాకారులకు సూచించారు. శుక్రవారం పాల్వంచ పట్టణ పరిధి శ్రీనివాస కాలనీలోని మినీ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడా జట్లకు షీల్డులు, ప్రశంశా పత్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సమావేశంలో సాబీర్ పాషా మాట్లాడుతూ విద్యాసంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తే మెరుగైన ఫలితాలు అందుతాయని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని అన్నారు. భద్రాద్రి జిల్లాలో క్రీడాకారులకు కొదువులేదు, వారికి కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ ప్రతిభ కనబరచి జిల్లాకు వన్నె తేవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధికారి డాక్టర్ యుగేందర్ రెడ్డి, కార్యదర్శి మహీధర్, సిపిఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, క్రీడా అధికారులు, పి. ఎ. టి లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment