మంత్రి పొంగులేటి పాల్వంచ పర్యటనను జయప్రదం చేయాలి - కొత్వాల

మంత్రి పొంగులేటి పాల్వంచ పర్యటనను జయప్రదం చేయాలి - కొత్వాల

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పాల్వంచ మండలంలోని ప్రభాత్ నగర్ (రెడ్డి గూడెం), పాండురంగాపురం గ్రామాల్లో పర్యటించనున్నారని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డిసిఎంస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు కోరారు.

పాల్వంచ మున్సిపాలిటీ అయ్యప్పనగర్‌లో మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ఈ పర్యటనలో ప్రభాత్ నగర్‌లో రూ. 1 కోటి వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ వంతెన పనులను మంత్రి పొంగులేటి ప్రారంభించనున్నారు అని తెలిపారు. పాండురంగాపురంలో రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న BT రోడ్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. పొంగులేటి అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొని మంత్రి పర్యటనను జయప్రదం చేయాలి ఈ సందర్భంగా ఆయన కోరారు.


ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాలే జానకిరెడ్డి, మాజీ జడ్పిటిసి యర్రంశెట్టి ముత్తయ్య, సొసైటీ డైరెక్టర్ సామా జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బాలినేని నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, కాపర్తి వెంకటాచారి, పైడిపల్లి మహేష్, వాసుమల్ల సుందర్ రావు, పులి సత్యనారాయణ, గంధం నర్సింహారావు, ఉండేటి శాంతివర్ధన్, భాషాబోయిన అశోక్, బండి నాగరాజు, మాలోత్ కోటి నాయక్, ఆవుల మధు, సందు ప్రభాకర్, సోమా వెంకటరెడ్డి, నిమ్మల మోహన్ రెడ్డి, చిట్యాల సుబ్బారెడ్డి, వాసుమల్ల వీరాస్వామి, కోడిపుంజులవాగు రాములు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.