నల్సా హెల్ప్ లైన్ స్టిక్కర్ ను ఆవిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

నల్సా హెల్ప్ లైన్ స్టిక్కర్ ను ఆవిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ - హైదరాబాద్ వారు జారీచేసిన హెల్ప్ లైన్ నెంబర్ 15100 ను విస్తృతంగా ప్రజలలో ప్రచారం చేసేందుకు రూపొందించిన స్టిక్కర్లను సోమవారం  జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్  పాటిల్ వసంత్ ఆవిష్కరించారు. 

ఈ స్టిక్కర్ ను భద్రాద్రికొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బస్టాండ్ లలో, ట్యాక్స్ స్టాండ్లు, హాస్పిటల్స్,  కలెక్టర్ కార్యాలయం, ఎమ్మార్వో  ఆఫీస్లలో, బ్యాంకులలో,  జైళ్లు,పోలీస్ స్టేషన్ లు, తదితర రద్దీ ప్రదేశాలలో ప్రదర్శించాలని తెలిపారు. ఉచిత న్యాయ సలహాలు, సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం ప్రజలు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ను సద్వినియోగం  చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.