రేపటి నుంచి తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. నిర్వహణకు సర్వం సిద్ధం..!!
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 46 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణ ప్రభుత్వం బయోమెట్రిక్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. పరీక్ష కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనుంది. హైరరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్ కేంద్రాల్లో ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించింది.

Post a Comment