పెద్దమ్మతల్లిని అధికసంఖ్యలో దర్శించుకున్న భక్తులు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ మండలం లోని కేశవాపురం-జగన్నాధపురం గ్రామంలో వెలసియున్న కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి) నందు ఆదివారం భక్తులు అధికసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. పరిసర గ్రామాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు తరలి వచ్చి తమను చల్లంగా చూడాలని వేడుకుంటూ బోనాలు అమ్మవారికి సమర్పించారు.
అన్నప్రాశనలు, వాహనపూజలు, తలనీలాలు, అమ్మవారికి ఒడిబియ్యం, చీరలు, కనుములు తదితర మొక్కులను చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకొని తీర్ధప్రసాదములను స్వీకరించారు. భక్తులకు అవసరమైన ప్రత్యేక దర్శనమునకు క్యూలైన్లు, ఉచిత పులిహోర ప్రసాద వితరణ, మంచినీటి వసతి తదితర ఏర్పాట్లను దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.రజనీకుమారి, సిబ్బంది పర్యవేక్షించినారు.

.webp)
Post a Comment