బిజెపి నాయకుల దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నేతలు
జె.ఎచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజెపి, శివసేన షిండే వర్గం పార్లమెంట్ సభ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పాల్వంచ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక అంబేద్కర్ సెంటర్ లో బీజేపీ నాయకుల దిష్టి బొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ, జిల్లా ఐ.ఎన్.టి.యు.సి అధ్యక్షులు ఎస్.ఏ జలీల్, ఎల్.డి.ఎం కోర్డినేటర్ బద్ది కిషోర్, కాంగ్రెస్ నాయకులు భువన సుందర్ రెడ్డి, సాదం రామకృష్ణ, కట్టా సోమయ్య,చింతా నాగరాజు, దొప్పలపూడి సురేష్, బి.ఎన్ చారి, ఎస్కే దస్తగిరి, దేవీలాల్, కిలారు నాగ మల్లేశ్వర రావు, అబ్దుల్లా,రాము నాయక్, గౌస్, ఎస్కే చాంద్, సాంబయ్య, ఓలపల్లి రాంబాబు, వీరమల్ల గణేష్, సుమన్, హుస్సేన్ నాయక్, లింగ్యా నాయక్, ఎన్.ఎస్.యు. ఐ భార్గవ్, ఇజ్జగాని రవి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment