మహాత్మా మన్నించు.. గాంధీ జయంతి నాడే స్పైసీ స్పైసీ వివాదం
- నాగేశ్వరుడికి షంషేర్ భాషా అండదండలు
- మహాత్మా మన్నించు.. గాంధీ జయంతి నాడే స్పైసీ స్పైసీ వివాదం
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నాగేశ్వరుడి పైశాచికత్వం
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: గాంధీ జయంతి రోజున పాల్వంచలో ఓ ప్రముఖ రెస్టారెంట్లో చోటు చేసుకున్న వివాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేస్తున్న ఓ కార్మికుడు తన పని ముగించుకున్న అనంతరం అర్ధరాత్రి భోజనం చేస్తున్న సమయంలో రెస్టారెంట్ యజమాని నాగేశ్వరుడు దుర్భాషలాడి, దాడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజంతా కష్టపడి పనిచేసిన ఆ కార్మికుడి పట్ల ఇలాంటి దాడి జరగడాన్ని పలువురు నాయకులు ఖండిస్తున్నారు.
కార్మికుడిపై దాడి జరిగిందనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు. కార్మికుల శ్రమతో వ్యాపారం సాగించే యాజమాన్యాలు వారి గౌరవం, హక్కులను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వివాదం నేపథ్యంలో కొత్తగూడెం నియోజకవర్గంలో ఓ ప్రజా ప్రతినిధి షాడో షంషేర్ భాషా వైఖరిపై కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పాల్వంచలో గరం గరం రుచులుండే ఓ ప్రముఖ రెస్టారెంట్ యాజమాన్యానికి ఆయన అండగా నిలుస్తున్నారా అని ప్రశ్న వస్తే అవుననే సమాధానం వస్తుంది. పలుకుబడి ఉన్నవారికి ఆయన మద్దతుగా నిలిచి లబ్ధి పొందుతారు. పేదలు, కార్మికుల ఎటు పోతే నాకేంటి, ఇకనైనా మనం ఎదుగుదాం అనే వైఖరి ఈ మధ్య కాలంలో ఆయనలో చూస్తున్నామంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే టేస్టీ టేస్టీ స్పైసీ రుచులకు ప్రీతిపాత్రుడైన షంషేర్ భాషా.. నాగేశ్వరుడికి మద్దతుగా నిలిచి నిరుపేద హోటల్ కార్మికుడికి న్యాయం జరగకుండా ఎత్తుకు పైఎత్తు వేసి నాగేశ్వరుడికి అండగా నిలుస్తున్నారు అంటూ విమర్శలు హాట్ హాట్‌గా చక్కర్లు కొడుతున్నాయి.
అయితే నాగేశ్వరుడు.. రెస్టారెంట్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన అనుమతులు, భద్రతా ప్రమాణాలు మరియు నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరయ్యాయా అనే అంశం, పార్కింగ్ ప్లేస్ లేకుండా రెస్టారెంట్ నడుపుతూ, పాత ఓ ప్రభుత్వ కార్యాలయంను సైతం పూర్తిగా తన రెస్టారెంట్‌కు పార్కింగ్ ఏరియాగా మార్చేశారని విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఇంత తంతు జరుగుతున్న ఈ రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోకపోవడం ఏంటి? అని ప్రశ్నలు సర్వత్రా అందరిలో వ్యక్తమవుతున్నాయి.
రెస్టారెంట్ కార్మికుల బ్యాంకు ఖాతాలు/UPI ఖాతాల ద్వారా కస్టమర్ల నుంచి వచ్చిన నగదు లావాదేవీలు నిర్వహించి, GST లేదా ఇతర పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై సంబంధిత పన్ను అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేయాలి అంటూ పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment