రాష్ట్రస్థాయి సైన్స్ ఒలంపియాడ్‌లో సత్తా చాటిన పాల్వంచ విద్యార్థి

రాష్ట్రస్థాయి సైన్స్ ఒలంపియాడ్‌లో సత్తా చాటిన పాల్వంచ విద్యార్థి

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  రాష్ట్రస్థాయి సైన్స్ ఒలంపియాడ్‌లో పాల్వంచకు చెందిన శ్రీ సిద్ధార్థ హై స్కూల్ 9వ తరగతి విద్యార్థి సయ్యద్ ఖాజా మొయినుద్దీన్ సత్తా చాటాడు. శ్రీ శ్రీ రామానుజ ఫౌండేషన్ నిర్వహించిన ఒలంపియాడ్ పరీక్షల్లో ఖాజా మొయినుద్దీన్ ప్రథమ బహుమతి సాధించాడు.

 ఇటీవల నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఖాజా మొయినుద్దీన్ అవార్డు అందుకున్నాడు.

ఈ సందర్భంగా ఖాజా మొయినుద్దీన్ అవార్డు అందుకోవడం పట్ల అతని తండ్రి సీనియర్ పాత్రికేయుడు సయ్యద్ నజీరుద్దీన్, తల్లి శాహెదా సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమారుడిని ప్రోత్సహించిన పాఠశాల యాజమాన్యానికి  వారు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే శ్రీ సిద్ధార్థ హై స్కూల్  కరస్పాండెంట్ బండి లక్ష్మణ్ మాట్లాడుతూ ఖాజా మొయినుద్దీన్ సాధించిన విజయం పాఠశాలకు గర్వకారణమని తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు ఇలాంటి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించే విధంగా బోధనలు అందిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రస్థాయి సైన్స్ ఒలంపియాడ్‌లో సత్తా చాటిన పాల్వంచ విద్యార్థి


Blogger ఆధారితం.