ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్
జె.హెచ్.9. మీడియా, ఆదిలాబాద్: రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ సంయుక్త సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరెడ్డి లంచం తీసుకుంటుండగా శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల చేతికి రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు.
ఫిర్యాదుదారు తన భార్య పేరు మీద గల గృహాన్ని బహుమతి డీడ్ క్రింద నమోదు చేయించుకోవడానికి అధికారిక సహాయం కావాలని కోరగా, ఇందుకు ప్రతిఫలంగా రూ.5,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఈ సందర్భంగా ACB అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే, పౌరులు వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1064 కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాట్సాప్ 9440446106 కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

Post a Comment