గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు

 

గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  గణేష్ నవరాత్రుల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వద్ద గోదావరి నదికి నిమజ్జనోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్టమైన ఏర్పాట్లను చేయడం జరుగుతుందని ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.

ఈ సందర్భంగా  గోదావరి నది కరకట్ట వద్ద జరుగుతున్న నిమజ్జనోత్సవ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. అక్కడ ఉన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఆనంతరం ఎస్పీ మాట్లాడుతూ గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో పరిసర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి నదీ ప్రవాహాన్ని వీక్షించేందుకు కరకట్టపై ఎవరూ రాకూడదని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఎవరైనా కరకట్టపై సంచరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు.

అలాగే, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కరకట్ట పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. నిమజ్జనోత్సవానికి గణేష్ ప్రతిమలను తీసుకొచ్చే ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ సూచనలను పాటిస్తూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్, భద్రాచలం సీఐ నాగరాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertising:


Blogger ఆధారితం.