కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల చెక్కు అందజేసిన ఎస్పి

కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల చెక్కు అందజేసిన ఎస్పి


జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  టీవల రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ టి. అనిల్ కుమార్ కుటుంబానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కోటి రూపాయల చెక్కును జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (ఐపీఎస్) చేతుల మీదుగా అందజేశారు. పోలీస్ శాలరీ ప్యాకేజీ అకౌంట్ ద్వారా యూనిఫాం సర్వీస్ కస్టమర్ల సంక్షేమం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన స్కీమ్ ద్వారా వచ్చిన ఈ నగదును అనిల్ కుమార్ కుటుంబానికి శుక్రవారం అందించారు.

ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రీజినల్ మేనేజర్ ఎం. సత్యనారాయణ, చీఫ్ మేనేజర్ ఆంజనేయ రమేష్, బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


Blogger ఆధారితం.