మోడ్రన్ ఇఖ్రా స్కూల్ లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : మోడ్రన్ ఇఖ్రా స్కూల్ లో జాతీయ గణిత దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 22న గణిత పితామహుడు శ్రీనివాస్ రామానుజన్ జయంతి (గణిత దినోత్సవం)ను పురస్కరించుకొని శనివారం కొత్తగూడెం మున్సిపాలిటీ 12వ వార్డు సుభాష్ చంద్రబోస్ నగర్‌లోని మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో గణిత శాస్త్ర ఔన్నత్యాన్ని తెలియజేస్తూ విద్యార్థులు చేసిన ప్రసంగాలు, నృత్య ప్రదర్శనలు, నాటకాలు అందర్నీ అలరించాయి.
ఈ సందర్భంగా మోడ్రన్ ఇఖ్రా పాఠశాల కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ శ్రీనివాస్ రామానుజన్ గణిత శాస్త్రంలో చేసిన సేవలను వివరించారు. "మనిషి జీవితంలో ప్రతి అంశం గణితంతో ముడిపడి ఉంది" అని ఆయన అన్నారు. గణితంలో రాణిస్తే అన్ని రంగాల్లో రాణించడం సులువని, విద్యార్థులు గణితంపై పట్టు సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పర్వీన్ సుల్తానా, ఉపాధ్యాయులు నుసరత్, నీలా, ప్రసన్న, సరస్వతి, విజయలక్ష్మి, అనితా, ఖాజా, సల్మా, లతీఫా తదితరులు పాల్గొన్నారు.
Post a Comment