మిలాద్-ఉన్-నబీ ఏర్పాట్లను పరిశీలించిన ఎంఐఎం అధ్యక్షులు
మిలాద్-ఉన్-నబీ ఏర్పాట్లను పరిశీలించిన ఎంఐఎం అధ్యక్షులు మొహీద్ పటేల్
ఈ నెల 20వ తేదీ శుక్రవారం జరగనున్న మిలాద్-ఉన్-నబీ వేడుకల ఏర్పాట్లను సోమవారం నారాయణఖేడ్ ఎంఐఎం అధ్యక్షులు, న్యాయవాది మొహీద్ పటేల్, మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్, మిలాద్ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. అనంతరం దర్గా మసీదు వద్ద పరిసుభ్రత, లైటింగ్ ఇతర తగిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మొహీద్ పటేల్ మాట్లాడుతూ, మసీదుల వద్ద పరిసుభ్రత, లైటింగ్ తగిన సదుపాయాలు అందించాలని నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్‌ను కోరారు.

Post a Comment