పాల్వంచ బుడతడికి అంతర్జాతీయ స్థాయి వార్డ్
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : వరల్డ్ కరాటే ఫెడరేషన్ (WKF) ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘వండర్ కిడ్–2025’ అవార్డుకు పాల్వంచకు చెందిన ఎక్స్ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థి అబ్దుల్ నోమాన్ ఎంపికయ్యాడు.
ఎక్స్ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ నిర్వాహకుడు కోనే సూరిబాబు అందించిన క్రమశిక్షణాత్మక శిక్షణ, నోమాన్ సాధన, సృజనాత్మకత..ఇవన్నీ కలిసి చిన్న వయస్సులోనే అతడికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చాయి.
ఈ సందర్భంగా నోమాన్ చదువుతున్న లిటిల్ ఫ్లవర్ స్కూల్ కరస్పాండెంట్ ఎం. కృష్ణ విద్యార్థిని అభినందించారు. భవిష్యత్తులో నోమాన్ మరిన్ని ఉన్నతస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
అనంతరం తల్లిదండ్రులు అబ్దుల్ రెహమాన్, ఆయేషా పిరదోస్ మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు.
నోమాన్ విజయం పాల్వంచకు గర్వకారణంగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు

Post a Comment